భారత క్రికెట్ హిస్టరీలో.. అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్ అందించిన కెప్టెన్లు వీళ్లే?

praveen
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీ తుదిదశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఇక ఈ వరల్డ్ కప్ టోర్నీకి శుభం కార్డు పడుతుంది. కాగా టోర్ని మొత్తం అసాంతం ఎంతో ఆసక్తికరంగా సాగగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ వరకు చేరుకున్నాయి అని చెప్పాలి. అయితే ఈ ఫైనల్ పోరు మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది  ఎందుకంటే గత కొంతకాలం నుంచి దాదాపు రెండు ఐసిసి టోర్నీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా భారత్ జట్లు తలపడ్డాయి. అయితే రెండుసార్లు కూడా అటు ఆస్ట్రేలియాదే పై చేయి అన్నట్లుగా కొనసాగింది.

 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ రెండు టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా వరుసగా విజయం సాధిస్తూ దూసుకు వచ్చిన యంగ్ టీమ్ ఇండియా  ఫైనల్లో చోటు సంపాదించుకుంది అని చెప్పాలి. సౌతాఫ్రికా పై సెమీఫైనల్ అతి కష్టం మీద గెలిచి ఇక ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించాలని పట్టుదలతో ఉంది. అయితే ఇక ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు భారత క్రికెట్ హిస్టరీలో అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ టైటిల్ అందించింది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 అయితే 2000 సంవత్సరంలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో మొదటిసారి యంగ్ టీమ్ ఇండియా టైటిల్ అందుకుంది. ఆ సమయంలో టీం ఇండియాకు మహమ్మద్ కైఫ్ సారధిగా వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత టీమ్ ఇండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008లో వరల్డ్ కప్ అందుకుంది అండర్ 19 టీమ్ ఇండియా. ఇక 2012లో ఉన్ముఖ్ చంద్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచిన యంగ్ టీమ్ ఇండియా 2018లో పృద్విషా సారథ్యంలో టైటిల్ నెగ్గింది. ఇక 2022లో యాష్ దుల్ సారథ్యంలోనూ అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచింది యువ భారత జట్టు. కాగా ఇప్పుడు అండర్ 19 జట్టుకి ఉదయ్ సహారన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: