ఇదెక్కడి టాలెంట్ గురూ.. 6 బంతులకు ఆరు రకాల బౌలింగ్ యాక్షన్స్?

praveen
సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారిపోయిన ఆటగాడు ఇక బౌలర్గా మారితే ఇక తనకంటూ ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో బుమ్రా, మలింగా సహా మరికొంతమంది బౌలర్లకు కూడా ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఉంటుంది. ఇక తమదైన బౌలింగ్ యాక్షన్ తోనే బంతులు విసురుతూ అదరగొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక బౌలర్ మాత్రం తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ తో ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

 ఏకంగా ఇతని బౌలింగ్ యాక్షన్  టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ బౌలర్ను చూస్తుంటే ఏకంగా అపరిచితుడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ బంతికి ఎలాంటి బౌలింగ్ యాక్షన్ తో బంతులు విసురుతాడు అన్న విషయం ఊహకుందని రీతిలోనే ఉంది అని చెప్పాలి. ఏకంగా అతను వేసిన ఒక ఓవర్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అతని పేరు కే బాలాజీ. మీడియం ఫేసర్. తమిళనాడులో జరుగుతున్న ఎస్ఎస్ రాజన్ టి20 టోర్నమెంట్లో ఆడుతున్నాడు.

 అయితే ఇటీవలే అతను వేసిన ఒక ఓవర్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసి అందరు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఓవర్ లోని ఆరు బంతులను ఆరు రకాల బౌలింగ్ యాక్షన్ తో విసిరాడు. తిరువూరు, తిరుపత్తూరు మధ్య సేలం వేదికగా మ్యాచ్ జరిగింది. 18 ఓవర్ ను బాలాజీ వేశాడు. అయితే ఒక్కో బంతిని ఒక్కో రకమైన బౌలింగ్ యాక్షన్ తో బంతి విసిరాడు అని చెప్పాలి. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. బాలాజీ ఇస్ మై న్యూ అడిక్షన్ అంటూ ఒక కామెంట్ కూడా రాసుకొచ్చాడు అశ్విన్. ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఇదెక్కడి బౌలింగ్ రా బాబు.. ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: