ఇద్దరు అంతే.. రోహిత్, కోహ్లీలపై షమి కామెంట్స్ వైరల్?

praveen
టీమిండియా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు మహమ్మద్ షమి. ఏకంగా తన ఆట తీరుతో ఇప్పటికీ తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. జట్టులోకి యువ ఆటగాళ్ళ రాకతో ఎంతోమంది సీనియర్ ప్లేయర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోతుంటే షమీ మాత్రం తన బౌలింగ్ ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ ప్రతి మ్యాచ్ లో కూడా తనను కొత్తగా నిరూపించుకుంటూనే ఉన్నాడు.

 దీంతో సెలెక్టర్లు సైతం షమీలాంటి అనుభవజ్ఞుడిని.. ఫుల్ ఫామ్ లో ఉన్న ఆటగాడిని కాదని జట్టులోకి మరో యువ ఆటగాడిని ఎంపిక చేయడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితి తీసుకు వస్తున్నాడు షమి. ఇక గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోర్నీలో శమీ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శమీ బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు అంటే చాలు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు అందరూ కూడా వనికి పోయే విధంగా తన స్వింగ్ బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు.

 అయితే వరల్డ్ కప్ సమయంలో గాయపడిన పడిన శమీ ఇక ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. అదే సమయంలో ఇక టీమిండియా కు అందుబాటులో లేకుండా పోయాడు అన్న విషయం తెలిసిందే.  కాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అని షమి చెప్పుకొచ్చాడు. ఎలాంటి పిచ్ పైన అయినా సత్తా చాట గలడు అంటూ తెలిపాడు. అయితే విరాట్ కోహ్లీ కూడా వరల్డ్ లోనే అత్యుత్తమ బ్యాటర్. ఇప్పటికే  ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు అంటూ మహమ్మద్ షమి తెలిపాడు. కాగా గాయం బారిన పడిన మహమ్మద్ సమీ కోలుకొని తొందరగా మళ్ళీ జట్టులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: