కోహ్లీలో.. ఆ ఆకలి ఎప్పుడు ఉంటుంది : రోహిత్

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు విరాట్ కోహ్లీ. అందరిలాగానే సాదాసీదా ప్లేయర్గా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అతి తక్కువ సమయంలో తాను చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. ఇక ఎంతోమంది క్రికెట్ లెజెండ్స్ సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. ఇక నేటి తరంలో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ రికార్డుల విషయంలో కోహ్లీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.

 అయితే ఇలా వరల్డ్ క్రికెట్లో అద్భుత ప్లేయర్గా హవా నడిపించడమే కాదు సోషల్ మీడియాలో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని రీతిలో ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఇంతటి స్టార్ ప్లేయర్గా ఎదిగినప్పటికీ ఇంకా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడిలాగే కనిపిస్తూ ఉంటాడు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేయాలనే కసి అతనిలో ఉంటుంది. ఈ క్రమంలోనే మంచి ఇన్నింగ్స్ లు ఆడుతూ టీమిండియా విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.

 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆట తీరుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఆటపట్ల విరాట్ కోహ్లీ అభిరుచి గౌరవం అద్భుతంగా ఉంటుంది. అతడు ఎప్పుడు రన్స్ చేసేందుకు ఆకలితో ఉంటాడు. వ్యక్తిగత కారణాలు తప్పిస్తే ప్రతిసారి ప్రతి మ్యాచ్ కి కూడా అందుబాటులో ఉంటాడు. జట్టు విజయం కోసం కృషి చేస్తూనే ఉంటాడు. అతడు ఒక్కసారి నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లలేదు. కోహ్లీని చూసి యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలి అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కాగా ప్రస్తుతం కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో జరగబోయే మొదటి రెండు టెస్టుకు దూరం అయ్యాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: