భారత క్రికెట్ చరిత్రలో.. నాలుగవ స్థానంలో రోహిత్?

praveen
టీమిడియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాని కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఐపీఎల్లో ఎలా అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా గుర్తింపును సంపాదించుకున్నాడో టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఏకంగా మిగతా కెప్టెన్లతో పోల్చి చూస్తే ఎక్కువ సక్సెస్ రేటు  మెయింటైన్ చేస్తూ హవా నడిపిస్తూ ఉన్నాడు రోహిత్ శర్మ.

 ఇకపోతే ప్రస్తుతం భారత జట్టు అటు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతూ ఉంది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో కాస్త తడబడినట్లు కనిపించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పట్టు బిగించింది అని చెప్పాలి. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఇంగ్లాండు, టీం ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఏకంగా ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా మారిపోయింది అని చెప్పాలి. ఎంతోమంది ప్లేయర్లు ఈ టెస్ట్ మ్యాచ్లో అరుదైన ఘనతలు సాధిస్తూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే టీమిండియా కు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ సైతం ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఏకంగా భారత జట్టు తరఫున అన్ని ఫార్మట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో రోహిత్ శర్మ నాలుగవ స్థానానికి చేరుకున్నాడు అని చెప్పాలి. ఈ లిస్టులో 34,357 పరుగులతో సచిన్ టాప్లో ఉండగా.. తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ 26,733 పరుగులతో ఉన్నాడు. రాహుల్ ద్రవిడు 24064 పరుగులు, రోహిత్ 18444, సౌరవ్ గంగూలీ 18,433 పరుగులతో ఉన్నారు అని చెప్పాలి. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో రోహిత్ ఇలా సౌరబ్ గంగూలీని అధిగమించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: