ఇంకా గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్న.. రింకు సింగ్ తండ్రి?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ నే ప్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలాంటి ఆటగాళ్ళకు ఐపీఎల్ లాంటి టోర్నీలో అవకాశం వచ్చిందంటే చాలు.. వారి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆటగాళ్ళకు కోట్ల రూపాయలు ధర పలుకుతుంది. కాబట్టి ఏకంగా ఆర్థికపరమైన సమస్యలు అన్ని తీరిపోయి ఇక సాఫీగా కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు.

 అలాంటిది ఇక టీమిండియా తరఫున అరంగేట్రం చేసి మంచి ప్రదర్శన చేస్తే ఇక వారి జీవితం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. కుటుంబంతో కలిసి లగ్జరీ లైఫ్ ని గడుపుతూ ఉంటారు ఎంతో మంది యంగ్ క్రికెటర్లు. అయితే ఇక ఇటీవల కాలంలో ఇండియన్ క్రికెట్ లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న క్రికెటర్ రింకు సింగ్. తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు. మెరుపు బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాడు.

 ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి భారత జట్టు తరుపున క్రికెట్ ఆడాలి అనే కలను నిజం చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే రింకు సింగ్ తండ్రి ఖన్ సింగ్ ఎల్పిజి గ్యాస్ సిలిండలను డెలివరీ చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పని చేస్తూనే ఐదుగురు పిల్లలను పెద్ద చేశాడు. మూడో కొడుకు అయినా రింకు స్టార్ క్రికెటర్ గా ఎదిగేందుకు కూడా ఆయన ఈ పని చేస్తూనే తోడ్పాటు అందించాడు. అయితే ఇక ఇప్పుడు రింకు స్టార్ క్రికెటర్ అయినప్పటికీ అతని తండ్రి మాత్రం ఇంకా గ్యాస్ సిలిండర్ లను డెలివరీ చేస్తూనే జీవనం సాగిస్తున్నాడు అని చెప్పాలి. దీంతో ఆయన సింప్లిసిటీకి హాట్సాఫ్ చెబుతున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: