టెస్టుల్లో అత్యధిక సిక్సలు కొట్టిన.. భారత బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమ్ ఇండియాకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అయితే గత 12 ఏళ్లుగా భారత పర్యటనకు వచ్చిన ప్రతి టీం పై కూడా అటు టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ లో విజయం సాధిస్తూ వస్తుంది. ఒక్క టీం కూడా భారత జట్టును సొంత గడ్డపై ఓడించలేకపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను కూడా అదే తరహాలో ఘనంగా ముగించాలని చూస్తుంది టీమిండియా. ఏకంగా ఇంగ్లాండ్ ను క్లీన్ స్వీప్ చేయాలి అనే పట్టుదలతో బరిలోకి దిగింది అని చెప్పాలి.

 అందుకు తగ్గట్లుగానే ఆటతీరు కొనసాగిస్తూ ఉంది. అయితే టెస్ట్ ఫార్మాట్లో భారత ఆటగాళ్లు రాణిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. ఏకంగా ఇంగ్లాండ్ తరహాలోనే ఆటాకింగ్ గేమ్ ఆడుతూ అదరగొట్టేస్తున్నారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా 175 పరుగుల ఆదిత్యంలో ఉంది టీమిండియా. ఇదే రీతిలో జోరు కొనసాగించింది అంటే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించడం ఖాయం అన్నది తెలుస్తోంది. అయితే ఇక మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతున్నారు. ఇలాంటి సమయంలో భారత జట్టు తరుపున టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఎవరి పేరిట ఉందా అని తెలుసుకోవడానికి భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

 ఈ క్రమంలోనే భారత జట్టు తరఫున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. టెస్టుల్లో సెహ్వాగ్ ఏకంగా 90 సిక్సర్లు బాదాడు. ఇక ఆ తర్వాత స్థానంలో మహేంద్రసింగ్ ధోని 78 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 77 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్ 69, కపిల్ దేవ్ 61, రవీంద్ర జడేజా 60, సౌరబ్ గంగూలీ 57, రిషబ్ పంత్ 55 సిక్సర్లతో టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ లుగా ఆ తర్వాత స్థానాలలో ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: