కోహ్లీ అయోధ్యకు వెళ్లకపోవడానికి.. కారణం అదేనా?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా ఇండియా పర్యటనకు వచ్చిన విదేశీ జట్టుతో మ్యాచ్లు ఆడుతుంది. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ముగించుకుంది టీమ్ ఇండియా. ఇప్పుడు రేపటి నుంచి ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధం అవుతుంది అని చెప్పాలి  అయితే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ దృశ్య ఇక టీమ్ ఇండియా ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన అతను తప్పకుండా అందుబాటులో ఉంటాడు.

 కానీ గత కొంతకాలం నుంచి విరాట్ కోహ్లీ సరిగా జట్టుకు అందుబాటులో ఉండడం లేదు. అయితే అటు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం ఆటగాళ్లు అందరూ కూడా ప్రాక్టీస్ లో చెమటోడుస్తూ ఉంటే.. అటు విరాట్ కోహ్లీ జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో ఇక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అతనికి ఆహ్వానం అందితే.. ఇక అక్కడ కనిపించలేదు విరాట్ కోహ్లీ. ఇక ఇటీవల బీసీసీఐ నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి కూడా కోహ్లీ హాజరు కాలేదు అని చెప్పాలి. దీంతో కోహ్లీకి ఏమైంది ఇలా జట్టుకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు అనే చర్చ తెర మీదకి వచ్చింది.

 కోహ్లీ ఏమైనా గాయం బారిన పడ్డాడా లేదంటే ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడా అని ఇక అభిమానులు అందరూ కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు. అయితే విరాట్ కోహ్లీ ఇలా గత కొంతకాలం నుంచి యాక్టివ్గా లేకపోవడానికి కారణం అతని భార్య అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ అన్నది తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకే విరాట్ కోహ్లీ ఇలాంటి వేడుకలకు దూరంగానే ఉంటున్నాడు అనేది తెలుస్తుంది. గత ఇంగ్లాండ్తో జరగబోయే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు కోహ్లీ దూరం కాబోతున్నాడట. మూడో టెస్ట్ నుంచి జట్టుతో జాయిన్ కాబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: