మూడు ఫార్మాట్లలో.. కెప్టెన్గా అత్యధిక పరుగులు సాధించింది వీళ్లే?

praveen
టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగిపోయాడు. అయితే దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో రీ ఎంట్రీ  ఇచ్చిన రోహిత్ శర్మ మొదటి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు అనుకున్నప్పటికీ రెండు మ్యాచ్లలో కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే చివరికి డక్ ఔట్ గా ఇక పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ. దీంతో వరల్డ్ కప్ కి ముందు రోహిత్ ప్రదర్శన చూసి అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు.

 ఇలాంటి పేలవమైన ప్రదర్శన చేస్తూ రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో జట్టును ఎలా సమర్ధవంతంగా ముందుకు నడిపించగలడు అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ మూడో టి20 మ్యాచ్లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా సెంచరీ తో కదం తొక్కాడు. 63 బంతుల్లోనే 121 పరుగులు చేసి అదరగొట్టేసాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఎన్నో అరుదైన రికార్డులు కూడా రోహిత్ శర్మ ఖాతాలో చేరిపోయాయి. కాగా ఇప్పటివరకు టి20 ఫార్మాట్లో కెప్టెన్గా రోహిత్ శర్మ చేసిన 121 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఇలా t20 ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టించాడు.

 ఈ నేపథ్యంలో ఇక మిగతా ఫార్మాట్ లలో కూడా కెప్టెన్ గా అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆ వివరాలు చూసుకుంటే..

 టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా సాధించిన 254 పరుగులే అత్యధిక పరుగులుగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత కూడా విరాట్ కోహ్లీ 243, 235 పరుగులతో మూడుసార్లు కెప్టెన్గా అత్యధిక పరుగుల రికార్డును సాధించాడు.

 ఇక వన్డే ఫార్మాట్లో కెప్టెన్గా వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 219 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా ఉంది. ఆ తర్వాత రోహిత్ శర్మ 208, సచిన్ 186 పరుగులతో తర్వాత స్థానంలో ఉన్నారు.
 ఇక టి20 ఫార్మాట్ విషయానికి వస్తే రోహిత్ ఇటీవల సాధించిన 121 పరుగులు కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా ఉండగా.. ఆ తర్వాత రోహిత్ సాధించిన 118, 111 పరుగులే అత్యధిక పరుగులుగా ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: