పంత్.. మళ్లీ టీమిండియాలోకి రావడం కష్టమే : జహీర్ ఖాన్

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా 2024 t20 వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతుంది. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా మంచి ప్రస్థానం కొనసాగించింది. కానీ దురదృష్టవశాత్తు చివరి అడుగులో బోల్తా పడి చివరికి టైటిల్ ను చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో అటు ఫైనల్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతిగా నిలిచింది. అయితే ఇక గత వరల్డ్ కప్ ఓటమి నిరాశ నుంచి బయటపడిన టీమిండియా.. ఏకంగా ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ షెడ్యూల్లో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటికే జట్టు ఎంపిక దాదాపుగా 90% పూర్తయిందని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే టి20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియా ఆడాల్సిన చివరి t20 సిరీస్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో ఆడేసింది. దీంతో ఇక ఇటీవల అదరగొట్టిన ప్లేయర్లకి అటు జట్టులో కూడా చోటు దక్కే అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. అయితే రోడ్డు ప్రమాదం బారిన పంత్ ఇప్పటికి మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టలేదు.

 అతను జట్టులోకి వస్తాడేమో అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక టి20 వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్ చోటు గురించి మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన పంత్ పూర్తిగా కోలుకొని తిరిగి రావడం కష్టంతో కూడుకున్న పని.. అతను ఫిట్నెస్ సాధించడం ఎంతో ముఖ్యం. రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ మళ్ళీ ఫామ్ లోకి రావాలి. ఒకవేళ అతను ఐపీఎల్లో రాణించిన.. అతన్ని మళ్లీ జట్టులోకి ఆడించేందుకు సెలక్టర్లు రిస్క్ చేస్తారని నేను అనుకోవట్లేదు అంటూ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: