సూపర్ ఓవర్ అంటే చాలు.. రోహిత్ కు పూనకం వచ్చేస్తుంది?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అని చెప్పాలి. బంతి బంతికి కూడా మ్యాచ్ ఫలితం కొన్ని కొన్ని సార్లు మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎలాంటి ఫలితం వస్తుంది అని ఊహించడం ప్రేక్షకులకు కూడా కొన్ని కొన్ని సార్లు కష్టతరం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఏకంగా దాదాపు విజయం ఖరారు అయిపోయింది అనుకుంటున్న సమయంలో కొంతమంది ఆటగాళ్లు అద్భుతం చేసి ఇక ఓడిపోతుంది అనుకున్న జట్టుకు విజయాన్ని అందించడం చేస్తుంటారు.

 అయితే ఇక ఇలా ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ చివరికి టై అయితే.. ఆ ఉత్కంఠ పీక్స్ కి చేరిపోతూ ఉంటుంది. ఏకంగా ఎంపైర్లు విజేత ఎవరు నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సూపర్ ఓవర్ లో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఇక వారికే విజయం వరిస్తూ ఉంటుంది. అయితే సూపర్ ఓవర్ లో రాణించడం అంత సులమైన విషయం ఏమీ కాదు. సాదరణంగా టి20 మ్యాచ్ లోనే ఒత్తిడి ఉంటుంది. అలాంటిది సూపర్ ఓవర్లో బ్యాట్ పట్టుకొని పరుగులు చేయాలి అంటే ఎంతో అనుభవం కూడా కావాలి. చాలామంది ఆటగాళ్లు ఒత్తిడికి తట్టుకోలేక సూపర్ ఓవర్ లో చివరికి విఫలం అవుతూ ఉంటారు అని చెప్పాలి.

 అందరూ ఏమో కానీ అటు భారత కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు మాత్రం సూపర్ ఓవర్ అనే మాట వినిపించింది అంటే చాలు పూనకం వచ్చేస్తూ ఉంటుంది. ఏకంగా మ్యాచ్ మొత్తంలో అతని ప్రదర్శన ఎలా ఉన్నా సూపర్ ఓవర్లో మాత్రం సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇప్పుడు వరకు టి20 ఫార్మాట్లో మూడుసార్లు సూపర్ ఓవర్లు ఆడాడు హిట్ మాన్. ఇక ఈ మూడు సార్లు కూడా తనదైన శైలిలో ప్రత్యర్థి పై విరుచుకుపడ్డాడు అని చెప్పాలి. 2018లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ జరగగా నాలుగు బంతుల్లో 15 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇక ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండు సూపర్ ఓవర్లలో 13, 11 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: