చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన రికార్డ్?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో కూడా తాను సారథ్యం వహించిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత కూడా అదే రీతిలో సక్సెస్ అవుతూ ఉన్నాడు అని తెలిపాలి. అయితే కేవలం కెప్టెన్ గా సక్సెస్ అవ్వడమే కాదు ఒకప్పుడు సారధిగా లేనప్పుడు కూడా జట్టు విజయాల్లో కీలకపాత్ర వహించి సక్సెస్ఫుల్ ప్లేయర్గా గుర్తింపుని సంపాదించుకున్నాడు.

 కాగా ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీ లో భారత జట్టు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో ఇక 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో అయితే చెలరేగిపోయాడు. 63 బంతుల్లో 121 పరుగులు చేసి ఇక క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆనందంలో ముంచేసాడు అని చెప్పాలి. అయితే ఇక మూడో టి20 మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా రోహిత్ శర్మ ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులు చేరిపోయాయి అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇక ఈ విజయంలో భాగం కావడం ద్వారా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక విజయాల్లో భాగస్వామ్యం పంచుకున్న ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

 ఇప్పుడు వరకు టి20 ఫార్మాట్లో రోహిత్ శర్మ అత్యధికంగా 250 విజయాల్లో భాగస్వామ్యం ఉన్న భారత ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు. అంతర్జాతీయ టి20 లు, ఐపిఎల్ వంటి టోర్నీలో ఆయన ప్రాతినిధ్యం వహించాడు అని చెప్పాలి. ఓవరాల్ గా హిట్ మాన్ ఇప్పటివరకు 390 కి పైగా t20 మ్యాచ్ లు ఆడాడు.  ఇందులో అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఉన్నాయి అని చెప్పాలి. కాగా ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగిపోవడమే కాదు.. రెండు సూపర్ ఓవర్లలో కూడా అదిరిపోయే ప్రదర్శన చేసి ఒంటి చేత్తో భారత జట్టును గెలిపించాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: