కెప్టెన్ గా.. ధోని రికార్డును బ్రేక్ చేసిన రోహిత్?

praveen
విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా కెప్టెన్ గా మూడు ఫార్మాట్ల సారధ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. ఇక కెప్టెన్ గా మారిన తర్వాత ఎంత సూపర్ సక్సెస్ అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తన కెప్టెన్సీ సామర్థ్యం ఏంటి అన్న విషయాన్ని ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించి నిరూపించుకున్నాడు రోహిత్. ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఇదే రీతిలో కెప్టెన్సీ ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక అతను కెప్టెన్సీలో ప్రస్తుతం భారత జట్టు మూడు ఫార్మాట్లలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు.

 మరీ ముఖ్యంగా టి20 ఫార్మాట్లో ఇక రోహిత్ ను మించిన కెప్టెన్ మరొకరు లేరేమో అనేంతలా ఇక అతనికి కెప్టెన్సీ వ్యూహాలతో అందరిని ఫిదా చేసేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఒక ఆటగాడిగా కూడా సూపర్ సక్సెస్ అవుతూ ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు హిట్ మాన్. అయితే 2022 t20 వరల్డ్ కప్ నాటి నుంచి పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉన్నారు రోహిత్. ఇక 14 నెలల గ్యాప్ తర్వాత ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టి20 సిరీస్ లో మళ్లీ పొట్టి ఫార్మాట్ లోకి వచ్చేసాడు. 2024 t20 వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని  రోహిత్ ఇలా చేశాడు అన్నది తెలుస్తుంది.

 ఇదిలా ఇక ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో రెండు మ్యాచ్లలో డక్ అవుట్ అయ్యి నిరాశపరిచిన రోహిత్ శర్మ.. మూడో మ్యాచ్లో సూపర్ సెంచరీ తో చలరేగిపోయాడు. అయితే ఇక మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది టీమిండియా. కాగా మూడో టి20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడంతో రోహిత్ అరుదైన ఘనత సాధించాడు  అంతర్జాతీయ టి20 లలో భారత్ ను ఎక్కువసార్లు గెలిపించిన కెప్టెన్ గా నిలిచాడు. ఏకంగా 41 విజయాలతో ధోని పేరిట ఉన్న రికార్డ్ 42 విజయాలు సాధించి రోహిత్ బ్రేక్ చేశాడు. ఇక బ్యాటింగ్ లోను రోహిత్ శర్మ తన హైయెస్ట్ టీ20 స్కోర్ ను నమోదు చేశాడు. 69 బంతుల్లో 121 పరుగులు బాధి వీర విహారం చేశాడు. ఇందులో 11 ఫోర్లు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: