అతన్ని వరల్డ్ కప్ లోకి తీసుకోకపోతే.. టైటిల్ గెలవడం కష్టమే : ఆకాష్ చోప్రా

praveen
2024 t20 వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది టీమ్ ఇండియా. ఈ ప్రపంచ కప్ టోర్ని వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఇక టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఎవరు భారత జట్టులో చోటు దక్కించుకోబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

 అయితే సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు మళ్లీ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో.. కొంతమంది యంగ్ ప్లేయర్లకు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇక ఒక్క స్థానం విషయంలో మాత్రం ఇద్దరు ప్లేయర్లకు మధ్య తీవ్రస్థాయిలో పోటీ నడుస్తుంది. టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ ఇక ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయం. అయితే అతనికి జోడిగా ఎవరు రాబోతారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే యువ ఆటగాళ్లు శుభమన్ గిల్, యశస్వి జైష్వాల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది అని చెప్పాలి.

 అయితే ఈ ఇద్దరిలో ఎవరు జట్టుకు సెలెక్ట్ అయితే బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీలు కూడా తమ అభిప్రాయాలను రివ్యూ రూపంలో చెప్పేస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు. యశస్వి జైష్వాల్ బ్యాటింగ్ తీరు అద్భుతం.. అతడని సెలెక్ట్ చేయకపోతే అన్యాయమే అవుతుంది. ఆయన ఎంపికకు అర్హుడు. అందుకే పరుగులు చేస్తూ ఇక్కడ వరకు వచ్చాడు. ఇప్పుడు ఏకంగా గిల్ ను మించిపోయాడు. కానీ ఇప్పుడు అతన్ని ముట్టుకోలేం అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతన్ని ఎంపిక చేయకపోతే.. 2022 t20 వరల్డ్ కప్ నుంచి టీమ్ ఇండియాలో వెంటాడుతున్న స్లో స్పీడ్ టెంపోను భారత్ రిపీట్ చేసే అవకాశం ఉంది  ఇలా సంవత్సరం మారుతుంది.. తప్ప పరిస్థితులు మాత్రం ఒకేలా ఉంటాయ్ అంటూ ఆకాష్ చోప్రా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: