రోబోలు కూడా ఇలా క్యాచ్ పట్టలేవేమో.. ఈ వీడియో చూస్తే మతి పోవాల్సిందే?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే ఎన్నో అద్భుతాలకు చిరునామాగా కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రేక్షకులు అందరూ కావాలనుకునే బ్యాటింగ్ మెరుపులు బౌలింగ్ ఉరుములు అన్ని కూడా టి20 లో కనిపిస్తూ ఉంటాయి. అంతకుమించి ఇక ఫీల్డింగ్ లో ఆటగాళ్లు చేసే విన్యాసాలు అయితే అటు ప్రేక్షకులు అందరిని కూడా అబ్బరపరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కేవలం అంతర్జాతీయ టి20 మ్యాచ్లలో మాత్రమే కాదు ఇక ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న టి20 లీగ్లలో కూడా ఇలాంటివి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి.

 ఇటీవల సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు ఆటగాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. వెస్టిండీస్ ప్లేయర్ జోహాన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ అయిన రోమారియా షెఫర్డ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అందుకున్నాడు. ఏకంగా అతని బాడీలోకి పక్షి ఆవహించిందేమో అన్నట్లుగా క్యాచ్ పట్టుకునేందుకు గాల్లోకి ఎగిరాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో ఈ అద్భుతం ఆవిష్కృతమైనది.

 నండ్రి బౌలింగ్ లో సూపర్ జెయింట్స్ ఓపెనర్ కొట్టిన షాటును రోమారియా నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ గా మలిచాడు. కాగా కొన్ని అడుగులపాటు గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తోనే క్యాచ్ పట్టుకుని అక్కడ మ్యాచ్ చూసిన ప్రేక్షకులందరికీ కూడా  నివ్వెర పోయేలా   చేశాడు  అయితే ఇది నిజమేనా కాదా అని రిప్లై లో స్లో మోషన్ లో చూస్తే కానీ అక్కడ ఉన్న ప్రేక్షకులకు అర్థం కాలేదు అని చెప్పాలి. అయితే ఇక ఇది చూసిన బ్యాట్స్మెన్ అయితే కాసేపటి వరకు అలాగే షాక్ లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో చూసి నేటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: