టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక.. ఇప్పటికే 95% ఖరారు : మాజీ సెలెక్టర్

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీం గా కొనసాగుతున్న భారత జట్టుకు గత కొంతకాల నుంచి వరల్డ్ కప్ గెలవడం అనేది కేవలం కలగానే మిగిలిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2011లో మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. అప్పటినుంచి ప్రపంచకప్ టోర్నీలలో మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ నాకౌట్ మ్యాచ్లలో మాత్రం ఓత్తిడికి చిత్తు అవుతూ చివరికి టైటిల్ గెలవాలనే కలలో కలగానే మిగిల్చుకుంటుంది. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా తప్పకుండా టైటిల్ గెలుస్తుంది అని అందరు అనుకున్నారు.

 ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి మళ్ళీ నిరాశ మిగిల్చింది. అయితే ఇక ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత జట్టు. కాగా వెస్టిండీస్ యూఏఈ వేదికలుగా ఈ ప్రపంచ కప్ టోర్నీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే 14 నెలల నుంచి టి20 ఫార్మాట్ కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీలు మళ్లీ పొట్టి ఫార్మట్ లో చేరడంతో ప్రస్తుతం టీమిండియా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే t20 వరల్డ్ కప్ లో ఎవరు జట్టులో స్థానం సంపాదించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

 ఇక ఇదే విషయం గురించి భారత మాజీ సెలెక్టర్ దీప్దాస్ గుప్తా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరిగే వెస్టిండీస్, అమెరికా పిచ్ లు బ్యాటింగ్కు సహకరించవు అంటూ తెలిపాడు. 160 - 170 పరుగులు చేయడమే అక్కడ కష్టమవుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు. అందుకే భారత జట్టులో యువకులతో పాటు సీనియర్లు కూడా ఉండాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జట్టులో ఉంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది అంటూ తెలిపాడు. హిట్ మ్యాన్ టీం ను నడిపించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ప్రపంచ కప్ జట్టు కూర్పు 90% పూర్తయింది అని అనుకుంటున్నా అంటూ మాజీ సెలెక్టర్ దీప్ దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: