షమి తమ్ముడు అంటే.. ఆ మాత్రం బౌలింగ్ పదును ఉంటుంది మరి?

praveen
మొన్నటి వరకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఒకే బౌలర్ గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. ఆ బౌలర్ ఎవరో కాదు టీమిండియా సీనియర్ ఫేసర్ మహమ్మద్ షమీ గురించి. ఎందుకంటే నేటి రోజుల్లో యువ ఆటగాళ్ల పోటీతో ఎంతోమంది సీనియర్ బౌలర్లు ఇక జట్టులో చోటు సంపాదించుకోలేక కనుమరుకవుతున్న సమయంలో అటు సీనియర్ అయినప్పటికీ మహమ్మద్ షమీ మాత్రం ఇక జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఎప్పటికప్పుడు అటు సరికొత్తగా తన ప్రతిభను చాటుకుంటూనే ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో షమీ అద్భుతం చేసి చూపించాడు. వరల్డ్ కప్ టోర్నీ మధ్యలో భారత జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఏకంగా వరుసగా మ్యాచ్ లలో వికెట్లు తీస్తూ టీమ్ ఇండియా విజయాలలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. ఇక అతి తక్కువ మ్యాచ్లలోనే ఎక్కువ వికెట్లు పడగొట్టి వరల్డ్ కప్ టోర్నీలో టాప్ వికెట్ టేకర్ గా కూడా నిలిచాడు. దీంతో మహమ్మద్ షమీ ప్రతిభ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు షమీ తమ్ముడు కూడా ఇలాగే తన టాలెంట్ తో  వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు.

 ఇటీవల రంజీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మహమ్మద్ షమీ తమ్ముడు అహ్మద్ కైఫ్ సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇటీవల యూపీతో జరిగిన మ్యాచ్ లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన అతడు ఏకంగా నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో బెంగాల్ తరఫున  హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు మహమ్మద్ కైఫ్. దీంతో యూపీ కేవలం 60 పరుగులకే ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి. అదే సమయంలో బెంగాల్ జట్టును టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ దెబ్బ కొట్టాడు. అతని దాటికి బెంగాల్ జట్టు 95 పరుగులకే పరిమితమైంది. కాగా షమి తమ్ముడు ఇలాగే రానిస్తే ఇక అతి త్వరలోనే టీమిండియాలో కనిపించే అవకాశం ఉందని క్రికెట్ విశేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: