క్రికెట్ కిట్ కోసం.. మా అమ్మ బంగారం అమ్మేసింది : దృవ్ జురెల్

praveen
పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ముందుకు సాగగలం.. సంకల్పం ఉంటే ఆ దేవుడు కూడా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. లక్ష్యం చేరేవరకు తోడుగానే ఉంటాడు. ఇది ఇప్పటివరకు ఎంతో మంది విషయంలో నిజం అని నిరూపితమైంది. ఎందుకంటే కష్టనష్టాలను ఎదుర్కొని పట్టుదలతో పోరాడిన వారు.. ఉన్నత శిఖరాలను అధిరోహించారు అని చెప్పాలి. అయితే ఇలాంటి వారి కోసం చర్చ వచ్చినప్పుడల్లా.. ఐపీఎల్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు గుర్తుకు వస్తూ ఉంటారు.

 ఎందుకంటే కనీసం మూడు పూటలా తినడానికి తిండి కూడా లేని కటిక పేదరికం నుంచి వచ్చి క్రికెట్ నే ఊపిరిగా భావించి ముందుకు సాగిన ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఐపీఎల్ రూపంలో అదృష్టం వరించింది అని చెప్పాలి. ఆయా యంగ్ ప్లేయర్స్ లోని ప్రతిభను  గుర్తించిన ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు పెట్టి ఇక జట్టులోకి తీసుకున్నాయ్. దీంతో ఇలా ఐపిఎల్ కు సెలెక్ట్ అవడంతోనే ఆ యంగ్ ప్లేయర్స్ కష్టాలన్నీ తీరిపోయాయి అని చెప్పాలి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు కోట్ల రూపాయల ధర పలికారు.

 అయితే ఇలా కోట్ల రూపాయల ధర పలికినవారు.. ఇక గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఐపీఎల్లో ఆడుతున్న దృవ్ జూరల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కనీసం క్రికెట్ కిట్ కొనుక్కునే ఆర్థిక స్తోమత కూడా తమ కుటుంబానికి లేదు అంటూ చెప్పుకొచ్చాడు. కిట్ కోసం తన అమ్మ బంగారం అమ్మ వేసినట్లు ద్రూవ్ జూరల్ తెలిపాడు. క్రికెట్ ఆడతానంటే మా నాన్న తిట్టేవాడు. ఇక క్రికెట్ కిట్ కు 7000 అవుతుందంటే ఆట మానేయమన్నారు. అప్పుడు బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేశా. దీంతో అమ్మ తన బంగారాన్ని అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చింది. కాగా ఇంగ్లాండ్తో జరిగే తొలి రెండు టెస్టులకు ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. దీంతో టీమిండియాలోకి రావాలి అనే కళ నెరవేరబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: