రెండో టీ20.. ఒక్క పరుగు చేయకూన్నా.. రోహిత్ ఖాతాలో ప్రపంచ రికార్డు?

praveen
2022 t20 వరల్డ్ కప్ లో ఆడిన భారత జట్టు సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు దాదాపు 14 నెలల విరామం తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్లో ఆడేందుకు సిద్ధమయ్యారు. 2024 t20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇద్దరు సీనియర్లను పొట్టి ఫార్మాట్లో సెలెక్ట్ చేసింది భారత సెలక్షన్ కమిటీ. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు సీనియర్లు మరోసారి t20 ఫార్మాట్ లో అదరగొట్టాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే మొదటి మ్యాచ్ కు అటు విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఇక మొదటి మ్యాచ్ ఆడిన రోహిత్ అభిమానులకు కూడా నిరాశ ఎదురయింది. ఎందుకంటే పరుగుల ఖాతా తెరవకుండానే రన్ అవుట్ రూపంలో డక్ అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ.

 అయితే మొదటి మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించిన టీమిండియా ఇక నేడు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్  కైవసం చేసుకోవాలని అనుకుంటుంది భారత జట్టు. ఇదిలా ఉంటే ఇక రెండో టి20 మ్యాచ్ నేపథ్యంలో ఇక రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది అని చెప్పాలి. ఇక రెండో టి20 మ్యాచ్ రోహిత్ శర్మ ఆడాడు అంటే ఒక్క పరుగు కూడా చేయకుండానే.. ఒక అరుదైన రికార్డు హిట్ మాన్ ఖాతాలో చేరిపోతుంది.

 అంతర్జాతీయ టి20 క్రికెట్లో 150 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రేయర్ గా రోహిత్ శర్మ నిలవబోతున్నాడు అని చెప్పాలి. నేడు ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే రెండో టి20 మ్యాచ్ తో ఈ ఘనతను అందుకోబోతున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటివరకు హిట్ మ్యాన్ 149 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడాడు. ఇక ఎవరు కూడా రోహిత్ కు చేరువలో లేరు. ఇక అతని తర్వాత స్థానంలో చూసుకుంటే ఐర్లాండ్ ప్లేయర్లు స్టీర్లింగ్ 134 మ్యాచులు, జార్జ్ డాక్రల్ 134 మ్యాచులు, పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ 124 మ్యాచ్లు, న్యూజిలాండ్ ప్లేయర్ గాప్తిల్ 122, బంగ్లాదేశ్ ప్లేయర్ మహమ్మదుల్లా 121 t20 మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లుగా కొనసాగుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: