సౌరబ్ గంగూలీ బయోపిక్.. ఇంతకీ హీరో ఎవరో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగా సినిమాలను తీస్తూ ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు ఎంతోమంది దర్శకులు. ఈ క్రమంలోనే ఇక ఆయా సెలబ్రిటీల గురించి తెలియని ఎన్నో విషయాలను సినిమాల ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నారు అని చెప్పాలి.

అయితే బయోపిక్ సినిమాలకు అటు ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉండడం.. ఇక కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేకపోవడం.. ఇక మినిమం గ్యారెంటీ సినిమాలుగా ఉండడంతో ఎంతో మంది దర్శకులు ఇలాంటి బయోపిక్ లు తీయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది క్రీడాకారులకు సంబంధించిన బయోపిక్ లు తెరమీదకి వచ్చాయి. ధోని, సచిన్ రంజి క్రికెటర్ ప్రవీణ్ తాంబె మొన్నటికి మొన్న శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధర్ భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇలా చాలామంది క్రీడాకారుల బయోపిక్ లు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని సినిమాలు హిట్టు కూడా అయ్యాయి.

 అయితే ఇక ఇప్పుడు మరో భారత క్రికెట్ లెజెండ్ బయోపిక్ తెరకెక్కబోతుంది అన్నది తెలుస్తుంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ జీవితంపై ఒక సినిమా తెరకెక్కపోతుందట. విక్రమాదిత్య మోత్వాన్ని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ బయోపిక్ లో గంగూలి పాత్రను ఆయుష్మాన్ ఖురానా పోషిస్తారు అన్నది తెలుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా ఆయుష్మాన్ ఖురాన సరిగ్గా సరిపోతారని డైరెక్టర్ భావించాడట. షూటింగ్ మొదలుకాకముందే ఈ బాలీవుడ్ హీరో క్రికెట్లో శిక్షణ తీసుకుంటాడట. జూన్లో ఈ మూవీ మొదలయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ సినిమా కోసం అటు సౌరవ్ గంగూలీ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారో అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: