టెన్నిస్ స్టార్ జకోవిచ్ క్రికెట్ ఆడితే.. నవ్వులు పూయిస్తున్న వీడియో?

praveen
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రీడాకారులు వారి వారి ఆటల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక అందరి చేత ది గ్రేట్ అనిపించుకున్నారు. అలాంటి వారిలో సెర్బియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ జకోవిచ్ కూడా ఒకరు. ఏకంగా టెన్నిస్ ఆటలో తనను మించిన ఆటగాడు మరొకరు లేరు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించాడు అని చెప్పాలి. ఇక ఎంతోమంది దిగ్గజాలను సైతం తన టాలెంట్ తో ఓడించి అతను కూడా ఒక దిగ్గజంగా మారిపోయాడు.

 ఇక రాబోయే కాలంలో కూడా టెన్నిస్ అనే ఆటలో జకోవిచ్ ను మించిన ఆటగాడు మరొకరు రారేమో అనే విధంగా ఎన్నో అరదైన రికార్డులను కూడా క్రియేట్ చేశాడు ఈ స్టార్ ప్లేయర్. అయితే టెన్నిస్ ఆటలో అతనికి తిరుగులేదు అని చెప్పాలి. కానీ టెన్నిస్ తో అదరగొట్టే జకోవిచ్ బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది.. ఊరుకోండి బాసు అతనికి క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏముంది.. టెన్నిస్ ప్లేయర్ కాబట్టి ఖాళీ సమయం దొరికిన టెన్నిస్ ఆడతాడు అంటారా.. కానీ ఇటీవల జకోవిచ్ ఏకంగా క్రికెట్ ఆడాడు.

 ఇటీవల మెల్ బోర్న్ లోని రాడ్లవర్ ఎరీనాలో స్టార్ క్రికెటర్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ తో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా క్రికెట్ ఆడాడు జాకోవిచ్. ఓ చారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా జకోవిచ్ బ్యాటింగ్ బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే టెన్నిస్ లో అదరగొట్టే జకోవిచ్ అటు బ్యాడ్ పట్టుకొని మాత్రం బంతిని కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు అని చెప్పాలి. కానీ ఆ తర్వాతి బంతిని మాత్రం టెన్నిస్ బ్యాట్ తో ఆడి స్టాండ్ లోకి పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: