రజినీకాంత్ కి హిట్టిచ్చిన దర్శకులతో.. మెగాస్టార్ సినిమా?

praveen
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇక వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక చిరంజీవి కెరియర్ లో ఇప్పటి వరకు ఎంత అద్భుతమైన సినిమాలు చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిద్యమైన పాత్రలతో ఇక ప్రేక్షకులను అలరించి అందరికి హృదయాల్లో మెగాస్టార్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కాగా ప్రస్తుతం బింబిసారా  ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా చేస్తున్నాడు.

 సోసియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే బింబిసార తర్వాత వశిష్ట చేస్తున్న మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే మరో తమిళ డైరెక్టర్ తో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నాడు అనే టాక్ తెరమీదికి వచ్చింది.

 జైలర్ అనే సినిమాను తీసి సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిసి కథ వినిపించారట. అయితే ఎన్నో రోజులుగా ఈ కాంబినేషన్ పై వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి సానుకూలంగానే స్పందించారట. దీంతో త్వరలోనే ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. కాక ఈ మూవీపై మెగాస్టార్ అభిమానులందరికీ కూడా అంచనాలు భారీ రేంజ్ లోనే పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: