
పేరుకే పసికూన జట్టు ప్లేయర్.. కానీ ఎలాంటి రికార్డు సాధించాడంటే?
అంచనాలకు మించి రాణిస్తూ చివరికి ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏదైనా చిన్న టీం కి సంబంధించిన ఆటగాడు ఇలా రికార్డులు కొల్లగొట్టాడు అంటే ఇక అతని పేరు వరల్డ్ క్రికెట్లో మారుమోగిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇటీవల జింబాబ్వే బౌలర్ ఇలాంటి ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. గతంలో మహా మహా టీమ్స్ ని సైతం భయపెట్టిన జింబాబ్వే.. ఇక ఇప్పుడు దీనస్థితిలో ఉంది అన్న విషయం తెలిసిందే. కానీ ఆ టీం ప్లేయర్స్ మాత్రం ప్రదర్శనలతో ఇటీవల కాలంలో అటు వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నారు.
కాగా జింబాబ్వే బౌలర్ రిచర్డ్ నగరవ వన్డేలు, t20 లలో సంచలన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా 28 మ్యాచ్లలో వికెట్లు తీస్తూనే వస్తూ ఉన్నాడు ఈ బౌలర్. ఈ క్రమంలోనే వికెట్లు తీయడంతో పాటు ఎంతో పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నాడు. కాగా తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన అద్భుతమైన బౌలింగ్ తో టాప్ క్లాస్ ఫాం కనబరుస్తున్నాడు. ఇలా వరుసగా ఆడిన 28 మ్యాచ్లలో కూడా వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సృష్టించాడు రిచర్డ్ నగరవ. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.