పాపం ఈ అమ్మాయి.. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే?

praveen
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా మొబైల్ అనేది ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కేవలం మనిషి అవసరాలు తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఆరడుగుల మనిషినే  ఆడిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పెరిగిపోయిన టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్న మనిషి ప్రతిక్షణం మొబైల్ ని వినియోగించకుండా ఉండలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్న కూడా అరచేతిలో మొబైల్ ఉండాల్సిందే.

 అయితే ఎక్కడికైనా వెళ్లారు అంటే చాలు అక్కడ మధురానుభూతులు అన్నింటినీ కూడా మొబైల్ లో బంధించి సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఇక ఇలాంటి మొబైల్ వాడే పిచ్చి కారణంగా చేదు అనుభవాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పాలి. సోషల్ మీడియాలో లైకులు సంపాదించాలనే ఆశలో మునిగిపోతున్నవారు కొన్ని కొన్ని సార్లు చిత్ర విచిత్రమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.  ఓ యువతి రోలర్ కోస్టర్ ఎంజాయ్ చేస్తుంది.

https://twitter.com/NoCapFights/status/1743183372086886879?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1743183372086886879%7Ctwgr%5Ebda68d7f8162fb1cb4974e8fc4226804f6238dbc%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
 అయితే ఈ రోలర్ కోస్టర్ పై వెళ్తున్న సమయంలో మధురానుభూతులు అన్నింటినీ కూడా రికార్డు చేయాలని అనుకుంది. ఆమె చేతిలో ఉన్నది ఐ ఫోన్ కావడంతో కాస్త ఖరీదైనదే అని చెప్పవచ్చు. అయితే దాన్ని జాగ్రత్తగా పట్టుకోవడంలో విఫలమైంది యువతి. దీంతో ఆ రోలర్ కోస్టర్ పైనుంచి సెల్ ఫోన్ కింద పడిపోయింది. దీనివల్ల ఆ ఫోన్ కచ్చితంగా ధ్వంసం అయ్యే ఉండవచ్చు అన్నది తెలుస్తోంది. అయితే ఇక యువతి ఇలా తన ఫోన్ తో ఏకంగా తనను తాను వీడియో తీసుకుంటున్న సమయంలో ముందు నుంచి మరో వ్యక్తి ఆ యువతీని వీడియో తీయగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ  వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: