బ్యాటింగ్ విధ్వంసం అంటే ఇదేనేమో..150 బంతుల్లో 242 రన్స్?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. రికార్డులు కొల్లగొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారేమో అన్న విధంగా వారి ప్రదర్శన తీరు సాగుతూ ఉంది అని చెప్పాలి. అద్భుతంగా ఆడుతూ ఇక సెలెక్టర్ ల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నారు ప్లేయర్లు. ఈ క్రమంలోనే భారత క్రికెటర్లు చేస్తున్న ప్రదర్శనలుపై అటు ప్రపంచ క్రికెట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే కేవలం మెన్స్ క్రికెటర్స్ మాత్రమే కాదు అటు మహిళా క్రికెటర్లు కూడా పురుషులకు ఎక్కడ తక్కువ కాదు అని రీతిలో ప్రదర్శనలతో అదరగొడుతున్నారు.

 ఇక ఇటీవల ఒక ప్లేయర్ ఏకంగా 150 బంతుల్లో 242 పరుగులు చేసి అదరగొట్టింది. ఏకంగా తన బ్యాటింగ్ విధ్వంసంతో భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. బౌలర్లతో చెడుగుడు ఆడిసిన ఆ ప్లేయర్ ఇక ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఆ ప్లేయర్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ప్రస్తుతం మాజీ ప్లేయర్లందరూ కూడా మాట్లాడుకుంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఇలా బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించిన ప్లేయర్ ఎవరో కాదు శ్వేత షేహ్రావత్. బీసీసీఐ. ఇటీవల నిర్వహించిన సీనియర్ మహిళల వన్డే టోర్నీలో ఢిల్లీ సెన్సేషన్ ప్లేయర్ శ్వేత షేహ్రావత్ విధ్వంసం సృష్టించింది.

 నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చేసి చూపించింది. 150 బంతుల్లోనే 242 పరుగులు చేసి వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడింది ఈ ప్లేయర్. ఇక ఇన్నింగ్స్ లో 31 ఫోర్లు 7 సిక్సర్లు ఉండడం గమనార్హం. దీంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకి భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించింది. 50 ఓవర్లలో ఢిల్లీ జట్టు 455/4 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేతనలో నాగాలాండ్ పూర్తిగా విఫలమైంది. కేవలం 55 పరుగులకే కుప్ప కూలింది  దీంతో ఢిల్లీ జట్టు 400 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: