టి20 వరల్డ్ కప్ కు.. అతను కెప్టెన్ గా ఉంటేనే బెటర్ : గంగూలీ
అయితే ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు ప్లేయర్లు మళ్ళీ టీంలోకి వస్తారా పొట్టి ఫార్మాట్లో మ్యాచ్ లు ఆడతారా లేదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఇక ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ అటు బిసిసిఐ ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ కి ఇద్దరు సీనియర్ ప్లేయర్ల పేర్లు కూడా జట్టులో చేర్చింది. కానీ ఇప్పటికీ కూడా వరల్డ్ కప్ కి రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగుతాడా లేదా అనే విషయంపై కన్ఫ్యూజన్ నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ ఏడది జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కు భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండాల్సిందే అంటూ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ ఒక గొప్ప లీడర్. వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. అలాగే వచ్చే టీ20 వరల్డ్ కప్ లో కూడా అతనికే జట్టు కెప్టెన్సీ అప్పగించి టైటిల్ సాధించాలి. ఇక అలాగే విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ వరకైనా పొట్టి ఫార్మాట్లో ఆడాలి. ఇది జట్టుకు ఎంతో బలాన్ని ఇస్తుంది అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.