ఫుట్ బాల్ ఆడుతున్న పంది, కుక్క.. వైరల్ వీడియో?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు కొన్ని ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఏకంగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇక మనుషుల్లాగా ప్రవర్తించే జంతువులు ఏవి అంటే అటు ఏనుగు, పిల్లి, కుక్క, చింపాంజీ లాంటి జంతువుల పేర్లు చెబుతూ ఉంటారు అందరూ  అయితే ఈ జంతువులన్నీ కూడా అచ్చం మనుషుల మాదిరిగానే ఆడుకోవడం హావభావాలను పండించడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ఒకే రకమైన జంతువులు ఇలా ఆడుకోవడం ఇప్పటి వరకు ఎన్నోసార్లు చూశాం. కానీ ఏకంగా ఒక్కసారి ఎదురుపడితేనే ఒక్కదానిపై ఒకటి మరొకటి దాడి చేసుకునే జంతువులు ఇలా సరదాగా ఆడుకోవడం చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.

 ఇక ఇప్పుడు ఇలాంటి రెండు జంతువులు ఇలా ఏకంగా ఫుట్బాల్ బంతితో ఆడుకుంటూన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా నల్ల పంది ఒక పొట్టి కుక్క కలిసి ఫుట్బాల్ ఆడాయి. పంది మూతితో బంతిని నెట్టగా అది కుక్కవైపు వెళ్ళింది   ఇక ఆ తర్వాత కుక్క దానిని తిరిగి దాని మూతితో పంది వైపు నెడుతుంది. పంది మళ్లీ ఆ బంతిని హిట్ చేయగా కుక్క తిరిగి కొట్టేందుకు బంతి వెంటపడటం ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూడవచ్చు. సాధారణంగా అయితే పంది కుక్క ఎదురుపడ్డాయి అంటే చాలు ఒకదానిని ఒకటి తరమడం లాంటివి చేస్తూ ఉంటాయి. కానీ ఇలా ఈ రెండు జంతువులు హ్యాపీగా స్నేహితుల్లాగా ఫుట్బాల్ ఆడటం చూసి నేటిజన్స్  షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: