కొత్త ఏడాదిలో.. కింగ్ కోహ్లీని ఊరిస్తున్న 10 రికార్డులు ఇవే?
దక్షిణాఫ్రికా తో కేఫ్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే సేన దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక 50 ప్లస్ స్కోర్స్ సాధించిన సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేస్తాడు. సచిన్ 74 సార్లు 50 ప్లస్ స్కోర్ సాధించగా కోహ్లీ 73 సార్లు ఈ ఘనత సాధించి రెండు స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ మరో 152 పరుగులు చేస్తే వన్డే ఫార్మాట్లో 14 వేల పరుగులను పూర్తి చేస్తాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డర్ సృష్టిస్తాడు.
విరాట్ కోహ్లీ మరో 35 పరుగులు చేస్తే టి20 క్రికెట్లో 12,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారతీయుడుగా రికార్డు సృష్టిస్తాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్ గా నిలుస్తాడు ఇందులో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరాన్ పొలార్డ్ ఉన్నారు.
విరాట్ కోహ్లీ మరో 554 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా అవతరిస్తాడు. ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ తో ఈ ఘన సాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ 2535 పరుగులతో టాప్ లో ఉన్నాడు.
కోహ్లీ మరో 21 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ ఫై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ గా రికార్డ్ సృష్టిస్తాడు.
కోహ్లీ 5 సెంచరీలు నమోదు చేస్తే స్వదేశంలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం 42 సెంచరీలతో సచిన్ టాప్ లో ఉన్నాడు.
మరో 30 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ ఫై అంతర్జాతీయ క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్ గా నిలుస్తాడు.
వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ 32 పరుగులు చేస్తే ఇక వెస్టిండీస్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు విరాట్ కోహ్లీ. 1919 పరుగులతో రాహుల్ ద్రావిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీ నమోదు చేయడానికి కోహ్లీ ఒక సెంచరీ దూరంలోనే ఉన్నాడు.
బంగ్లాదేశ్ తో టెస్టుల్లో 383 పరుగులు చేస్తే ఇక భారత్ తరపున బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. లిస్టులో 820 పరుగులతో సచిన్ టాప్ లో ఉన్నాడు.