టెస్ట్ జట్టులో అతను అవసరమా.. డీకే ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా క్రికెట్లో ఉండే వన్డే, t20 టెస్ట్ ఫార్మట్ లో అతి కష్టమైన ఫార్మాట్ ఏది అంటే ఇక ఆటగాళ్లు ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ ఫార్మాట్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ అనేది ఆటగాడి ప్రతిభకు అసలు సిసలైన పరీక్ష పెడుతూ ఉంటుంది. ఏకంగా ప్రతి ప్లేయర్ లోని ఓపికను పరీక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇక ఆటగాడిలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చేందుకు టెస్ట్ క్రికెట్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అని చెప్పాలి.

 అందుకే ఇక టెస్ట్ ఫార్మాట్ లాంటి సుదీర్ఘమైన ఫార్మాట్లో చాలామంది క్రికెటర్లు పెద్దగా రాణించలేకపోతు ఉంటారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో బ్యాట్ ఝాలిపించి భారీ ఇన్నింగ్స్ లు ఆడినవారు సైతం.. టెస్టు ఫార్మాట్లో ఎంతో ఓపికగా క్రీజులో పాతుకు పోలేక చివరికి ఇక వికెట్ల సమర్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు భారత జట్టులో చోటు సంపాదించుకునే ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పరిమిత ఓవర్లు ఫార్మాట్ లో అదరగొట్టిన గిల్ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం వరుసగా విఫలం అవుతూనే ఉన్నాడు.

 ఇప్పటివరకు 19 టెస్ట్ మ్యాచ్లలో 994 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఇక దినేష్ కార్తీక్ గిల్ టెస్ట్ ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ కి గిల్ అవసరమా అంటూ దినేష్ కార్తీక్ ప్రశ్నించాడు. అతని స్థానంలో దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, రాత్ పాటిదార్ మంచి ప్రత్యామ్నయం  అంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు దినిష్ కార్తీక్. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో గిల్ జట్టులో ఉన్నాడు అంటే అది నిజంగా అతనికి అదృష్టం లాంటిదే అంటూ చెప్పుకొచ్చాడు. కాగా దినేష్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: