టీమిండియాకి షాక్.. మరో స్టార్ ప్లేయర్ కి గాయం?

praveen
గత కొంతకాలం నుంచి భారత జట్టును గాయాల బెడద ఎంత తీవ్రంగా వేధిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో ఉన్న కీలక ప్లేయర్స్ అందరూ కూడా గాయం బారిన పడుతూ ఉండడంతో ఇక ఒక్కసారిగా టీం వ్యూహాలు మొత్తం తారుమారు అవుతూ ఉన్నాయ్. అయితే వరల్డ్ కప్ నాటి నుంచి కూడా భారత జట్టుకు ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. వరల్డ్ కప్ సమయంలో జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన హార్థిక్ పాండ్యా గాయం బారిన పడి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

 దీంతో అతని లాంటి ఆల్ రౌండర్ ను జట్టులో రీప్లేస్ చేయడం ఇక సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పర్యటనలో కూడా పలువురు ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. దీపక్ చాహార్ ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో దూరమైతే.. ఋతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమీ లాంటి ప్లేయర్లు గాయాలతో టీమిండియాకు దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే శార్దూల్ ఠాగూర్ కూడా జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అయితే ఇక ఇప్పుడు మరో భారత స్టార్ ప్లేయర్ జట్టుకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే ఈసారి గాయం బారిన మెన్స్ టీమ్ లో కాదు.. ఉమెన్స్ టీమ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రానా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బంతిని ఆపే క్రమంలో మరో ప్లేయర్ పూజ వస్త్రాకర్ ను ఢీకొట్టింది స్నేహ్ రానా. దీంతో ఆమె తలకు గాయం కావడంతో నొప్పితో  విలవిలలాడుతూ మైదానాన్ని వీడింది. అయితే ఆమె స్థానంలో కంకషన్ సబిస్టిట్యూట్ గా హార్లిన్ డియోల్ జట్టులోకి వచ్చింది. అయితే స్నేహ్ రానకు స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇక గాయం తీవ్రత తెలియనుంది. ఇలా భారత క్రికెట్లో కీలక ప్లేయర్లందరూ కూడా గాయం బారినపడి దూరమవుతూ ఉండడం మాత్రం ఇక ఆందోళనకరంగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: