నాన్న నువ్వు నా ప్రాణం అనినా.. మనసు దోచేస్తున్న వార్నర్ కూతురు వీడియో?

praveen
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ హృదయాలకు బాగా దగ్గరయ్యాడు. మరీ ముఖ్యంగా ఇక తెలుగు క్రికెట్ ప్రేక్షకులకు  అయితే ఇంట్లో ఒక వ్యక్తిగా మారిపోయాడు డేవిడ్ వార్నర్. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెనర్ గా  ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి వరల్డ్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్గా వెలుగొందుతున్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడి ఇక తెలుగు క్రికెట్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే కేవలం ఆటతోనే కాదు ఏకంగా తెలుగు హీరోల సాంగ్స్ పై డాన్సులు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక మరింత గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏకంగా సోషల్ మీడియా స్టార్ అనే ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు డేవిడ్ వార్నర్. అయితే ఇక డేవిడ్ వార్నర్ మరికొన్ని రోజుల్లో టెస్ట్ క్రికెట్ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక పాకిస్తాన్ తో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతుంది.

 అయితే ఇక ఇప్పుడు ఆట గురించి పక్కన పెడితే.. డేవిడ్ వార్నర్ గురించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. డేవిడ్ వార్నర్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అతని కోసం చిన్న కూతురు ఇస్లారోస్ ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్న ప్లేస్ కి వచ్చింది. అయితే ఇక డేవిడ్ వార్నర్ చిన్న కూతురు చేసిన పని కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా తన తండ్రిని హాగ్ చేసుకునేందుకు చిన్నారి గ్రిల్స్ లోపల నుంచి వెళ్ళింది. తండ్రిని హాగ్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చింది. ఈ వీడియో అందరి మనసులు దోచుకుంటుంది. నాన్న నువ్వు నా ప్రాణం అనినా అనే సాంగ్ తో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: