మాకు ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసు.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఆతిథ్య సఫారీ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన టెస్టు సిరీస్ ఇటీవలే ముగిసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించి ఇక సిరీస్ గెలుచుకోవడానికి విజయవంతమైన మొదటి అడుగు వేస్తుంది అనుకున్న టీమిండియా తొలి అడుగులోనే తడబడింది  ఏకంగా 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా చేతిలో పరాజయాన్ని చవిచూసింది అని చెప్పాలి  అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో అటు కేఎల్ రాహుల్ సెంచరీ విరాట్ కోహ్లీ 76 పరుగులు మినహా ఎవరు కూడా పెద్దగా రాణించలేదు.

 కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ చెత్త ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఐదు పరుగులు చేసిన హిట్ మాన్ రెండో ఇన్నింగ్స్ లో పరుగుల ఖాత తెరవకుండానే డక్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే భారత బ్యాట్స్మెన్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఫేస్, బౌన్స్ బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలో భారత బ్యాట్స్మెన్లకు తెలియదు అంటూ ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. అయితే ఇక ఈ విమర్శలపై అటు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. విదేశాల్లో ఎలా ఆడాలి అనే విషయం తమ జట్టుకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.

 గతంలో ఆస్ట్రేలియా ఇంగ్లాండులలో సాధించిన విజయాలను ఓసారి విమర్శలు చేస్తున్న వారు గుర్తు చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా తో మొదటి టెస్ట్ లో మా ప్రదర్శన బాలేదు. అదే సమయంలో మేము ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో ఎలా ఆడేమో అన్న విషయాలను కూడా మర్చిపోకూడదు. అక్కడ మేము సిరీస్ గెలిచాము. డ్రా చేసుకున్నాము. బ్యాటర్లు కూడా పరుగుల వరద పారించారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ లొ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: