రోహిత్ శర్మ.. ఒక ఫెయిల్యూర్ ఓపెనర్ : భారత మాజీ

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. జట్టుకు సారథిగా టీం ను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూనే ఇక మరోవైపు ఆటగాడిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. అలాంటి రోహిత్ శర్మ ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్లో మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

 అంతకుముందు అటు భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో తన బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ శర్మ.. అటు ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన తొలి టెస్ట్ లో మాత్రం చెత్త ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఐదు పరుగులు చేసిన రోహిత్ అటు రెండో ఇన్నింగ్స్ లలో మాత్రం కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేదు. ఏకంగా డకౌట్ గా వెనుతిరిగి అందరిని నిరాశపరిచాడు అని చెప్పాలి. అయితే రోహిత్ లాంటి బ్యాట్స్మెన్ పరుగులు ఖాతా తెరవకపోవడంతో టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

 ఇక రోహిత్ ఆట తీరిపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విదేశీ పిచ్ లపై టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిల్యూర్ ఓపెనర్ అంటూ బద్రీనాథ్ కామెంట్ చేశాడు. ఇప్పటివరకు ఓపెనర్ గా రోహిత్ పెద్దగా రాణించలేదు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై అతనికి మంచి రికార్డులు లేవు. ఈ నాలుగు దేశాలపై రోహిత్ 21 టెస్టులు ఆడి 1182 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే అతను ఒక ఫెయిల్యూర్ ఓపెనర్ అంటూ బద్రీనాథ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: