లెజెండ్ ను దాటేసిన రన్ మిషన్.. కోహ్లీ అరుదైన రికార్డ్?

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు. అయితే అతన్ని ఎందుకు అలా పిలుస్తారు అన్న విషయం అతను సాధించిన రికార్డులు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది. అయితే అందరిలాగానే ఒక సాదాసీదా క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు విరాట్ కోహ్లీ. కానీ ఇలా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తాను ఏకంగా వరల్డ్ క్రికెట్ ను ఏలే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. అంతేకాదు ఇక నేటి తరానికి తనను మించిన లెజెండ్ ఇంకెవరూ లేరు అన్న విషయాన్ని కూడా తన ఆటతో ప్రతిసారి నిరూపిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.


 ఇక ఎన్నో ఏళ్లపాటు భారత జట్టును కెప్టెన్ గా కూడా ముందుకు నడిపించి సత్తా చాటాడు అని చెప్పాలి. అయితే వరల్డ్ క్రికెట్లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం దాటిపోతున్న ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఎంతోమంది లెజెండ్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను బద్దలు కొట్టి తన పేరును లికించుకున్న ఈ స్టార్ ప్లేయర్ ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగా రికార్డుల వేట సాగిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల అటు సౌత్ ఆఫ్రికా తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో కూడా కోహ్లీ మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు.


 ఈ క్రమంలోనే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘనతను సాధించాడు. భారత జట్టు తరఫున టెస్టు ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీ టెస్టుల్లో 8790 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే క్రికెట్ లెజెండ్ వివిఎస్ లక్ష్మణ్ 8781 పరుగుల రికార్డును అధికమించాడు. కాగా కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో టాప్ లో ఉండగా.. రాహుల్ ద్రావిడ్ 13,625, గవాస్కర్ 10012 పరుగులతో కోహ్లీ కంటే ముందు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: