యావర్, ప్రశాంత్ లతో.. సినిమా తీయబోతున్న హీరో?

praveen
ఎన్నో రోజులపాటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరిని అలరించి ఇటీవల ఎంతో గ్రాండ్ గా ముగిసిన బిగ్బాస్ తెలుగు ఏడవ సీజన్ కంటెస్టెంట్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్.. ఇక హౌస్లో అతని స్నేహితులుగా నిలిచిన యావర్ శివాజీ ల గురించి ఇప్పటికి ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ ముగ్గురు గ్రూప్ ఏకంగా తమ ఆట తీరుతో ఎంతో మంది ప్రేమాభిమానాలను సంపాదించుకున్నారు. ఇక ఈ గ్రూప్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా కామన్ మ్యాన్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి హీరో శివాజీ అండగా నిలబడ్డాడు. చివరి వరకు సపోర్ట్ చేసాడు. ఏకంగా తాను గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ పల్లవి ప్రశాంత్ వెనకే నిలబడి అతన్ని విన్నర్గా నిలిపాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇటీవల శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. యావర్, పల్లవి ప్రశాంత్ లకు తాను సాయంగా ఉంటాను అంటూ పేర్కొన్నాడు.


 తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడిని అని తెలిసి కూడా యావర్ ప్రశాంత్ లు తమను ఇండస్ట్రీలోకి తీసుకువెళ్ళమని అడగలేదట. కానీ వారికి ఉన్న టాలెంట్ యాక్టింగ్ స్కిల్స్ తనకు తెలుసు అని.. మంచి అవకాశం ఇస్తే వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదుగుతారని శివాజీ అనుకుంటున్నాడట. ఇక తన వద్ద సినిమా తీసే సత్తా లేదు. కానీ ఉంటే మాత్రం వాళ్లతో ఒక సినిమా చేసే వాడిని అంటూ శివాజీ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కు నటన నేర్పిస్తే అద్భుతంగా చేయగలరని.. ఇక యావర్ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదని శివాజీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: