టెస్ట్ క్రికెట్కు మించింది మరొకటి లేదు : కోహ్లీ
అయితే ఇక ఇప్పుడు మరోసారి సౌత్ ఆఫ్రికా తో వారి సొంత గడ్డ మీదే టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమిండియా. ప్రస్తుతం భారత జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో తప్పకుండా టెస్ట్ సిరీస్ సాధించాలని పట్టుదలతో ఉంది. 31 ఏళ్ళ నిరీక్షణకు తెరదించాలని అటు కెప్టెన్ రోహిత్ కూడా భావిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటి వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో జరిగిన సిరీస్ లకి దూరంగా ఉన్న సీనియర్ క్రికెటర్లు టెస్ట్ ఫార్మాట్లో మాత్రం జట్టులో చేరిపోయారు. ఇప్పటికే ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా తో జరిగే టెస్ట్ సిరీస్ గురించి ఆయా ఆటగాళ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ ప్రాముఖ్యతను తెలియజేసాడు.
ఏకంగా టెస్ట్ క్రికెట్లో ఆడటం భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. టెస్ట్ మ్యాచ్ లో ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపిస్తే ఎంతో గొప్పగా అనిపిస్తుంది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను సాంప్రదాయవాదిని అందుకే టెస్టులు ఆడటం కంటే మించింది మరొకటి లేదు అని అనిపిస్తూ ఉంటుంది. టెస్ట్ క్రికెట్ కి ఆటకి పునాది అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే వరల్డ్ కప్ లో ఫుల్ ఫామ్ లో కనిపించిన విరాట్ కోహ్లీ.. టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో ఎలా రానిస్తాడో చూడాలి మరి