వరల్డ్ కప్ కి క్వాలిఫై అవ్వని టీం చేతిలో.. ఇంగ్లాండ్ ఘోర ఓటమి?
మొన్నటికి మొన్న ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది ఇంగ్లాండ్ జట్టు. ఏకంగా చిన్నచిన్న టీమ్స్ చేతుల్లో సైతం ఓడిపోయి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక లాంటి బలహీనమైన టీమ్స్ కి కూడా కనీస పోటీ ఇవ్వలేక ఓటమి చవిచూసింది. దీంతో ఇక ఇంగ్లాండ్ జట్టుఫై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కనీసం అటు సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టలేక ఇంటి బాట పట్టింది ఇంగ్లాండ్ జట్టు. అయితే వరల్డ్ కప్ లో దారుణ వైఫల్యం బాధ నుంచి బయటపడక ముందు ఇంగ్లాండ్ జట్టుకు మరిన్ని ముందే తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇక వరల్డ్ క ముగిసిన తర్వాత కూడా ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఇక వన్డే, t20 సిరీస్లను ఆడింది ఇలాంటివి రెండు సిరీస్ లను కూడా కోల్పోయి తీవ్ర విమర్శలు పాలైంది. వన్డే సిరీస్ ను 2-1 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు టి20 సిరీస్లో అగ్రశ్రేణి ఆటగాళ్ళతో బరిలోకి దిగినప్పటికీ విజయం మాత్రం సాధించలేకపోయింది. ఇలా ఏకంగా టి20 వరల్డ్ కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కు క్వాలిఫై కానీ వెస్టిండీస్ జట్టు చేతిలోఓడిపోవడం ఇంగ్లాండ్ జట్టు అభిమానులు అందరూ కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇలా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పెడుతున్న ఇంగ్లాండ్ జట్టుపై అటు సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులు ట్రోల్లింగ్ చేయడం మొదలుపెట్టారు.