వన్డే ఫార్మాట్లో.. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ అరుదైన రికార్డ్?
అయితే టి20 సిరీస్ ను 1-1 తో సమం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్ లో మాత్రం 2-1 తేడాతో ఏకంగా సఫారీలను వారి సొంత గడ్డ మీదే ఓడించి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టెస్టు సిరీస్ లో ఆతిథ్య సౌతాఫ్రికా తో తలబడేందుకు సిద్ధమవుతుంది టీమిండియా అయితే ఇక ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో అటు టీమ్ ఇండియా ప్లేయర్స్ తో పాటు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు కూడా పలు రికార్డులు కొల్లగొట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ హేన్రిచ్ క్లాసేన్ తన క్లాసిక్ ఆటతీరుతో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.
ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా నిలిచాడు క్లాసేన్. ఏకంగా 140.66 స్ట్రైక్ గ్రేడ్ తో బ్యాటింగ్ చేసి 900 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఇలా అత్యధిక స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో ఏ బి డివిలియర్స్ 137.91 స్ట్రైక్ రేట్, బెయిర్ స్ట్రో 118.22, రోహిత్ 117.07, జయ సూర్య 113.59, మార్కరమ్ 113.26, వార్నర్ 112.66 స్ట్రైక్ రేటుతో ఈ ఘనత సాధించిన ప్లేయర్లుగా తర్వాత స్థానంలో ఉన్నారు.