
వికెట్ కీపర్ గా.. ధోని రికార్డు సమం చేసిన కేఎల్ రాహుల్?
ఇటీవల కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లో వన్డే సిరీస్ లో బరిలోకి దిగింది భారత జట్టు. అయితే మొదటి మ్యాచ్ లో ఘనవిజయాన్ని సాధించిన టీమ్ ఇండియాకు.. రెండో మ్యాచ్లో చేదు అనుభవం ఎదురయింది. దక్షిణాఫ్రికా అనూహ్యంగా పుంజుకొని అదరగొట్టింది అని చెప్పాలి. కానీ ఆ తర్వాత మూడో మ్యాచ్లో మాత్రం సూపర్ విక్టరీని సాధించింది టీమిండియా. దీంతో 2-1 తేడాతో ఇక సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఈ విక్టరీతో అటు భారత అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు పలు రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నారు.
ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్లో ఏకంగా 21 పరుగులు చేశాడు కేఎల్ రాహుల్ దీంతో ఒక క్యాలెండర్ ఇయర్ లో వన్డే ఫార్మాట్లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో వికెట్ కీపర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు అని చెప్పాలి. 14 ఏళ్ల కిందట మహేంద్రసింగ్ ధోని ఈ ఘనత సాధించాడు. ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్ ఏకంగా ధోని సరసర నిలిచాడు అని చెప్పాలి. కాగా ఇటీవల జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో సంజు శాంసన్ ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయి ప్రశంసలు అందుకుంటున్నాడు.