గిల్ కు కెప్టెన్సీ ఇవ్వడంపై.. కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
2024 ఐపీఎల్ సీజన్ పై అభిమానులు అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆయా ఫ్రాంచైజీలు తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం అని చెప్పాలి. ఏకంగా జట్టుకు కెప్టెన్లుగా ఉన్న వారిని మార్చుతూ నిర్ణయాలు తీసుకుంటున్నాయ్ ఆయా ఫ్రాంచైజీలు. దీంతో కొత్త కెప్టెన్స్ సారాధ్యంలో ఆయా టీమ్స్ ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాయి అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే అటు గుజరాత్ టైటాన్స్ కి కూడా కొత్త సారధిని నియమించాల్సిన పరిస్థితి వచ్చింది.


 గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు సీజన్ లలోనే ఏకంగా ఛాంపియన్ టీం గా అవతరించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మొదటి ప్రయత్నంలోనే ఛాంపియన్గా నిలిచిన గుజరాత్.. ఇక రెండో ప్రయత్నంలో ఫైనల్ వరకు వెళ్లి ఇక రన్నరప్ తో సరిపెట్టుకుంది అని చెప్పాలి. అయితే 2024 లో కూడా గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్న సమయంలో ఏకంగా గుజరాత్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా ఆ టీం నుంచి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్ లోకి వెళ్లి ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. దీంతో ఇక గుజరాత్ జట్టులో విలియంసన్ లాంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ యువ ఆటగాడు గిల్ చేతిలో కెప్టెన్సీ పెట్టింది ఆ ఫ్రాంచైజీ.


 ఈ క్రమంలోనే అతను కెప్టెన్సీ తో ఎలా ఆకట్టుకుంటాడో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇదే విషయం గురించి ఆ జట్టు కోచ్ ఆశిష్ నెహ్ర స్పందించాడు. హార్దిక్ పాండ్యా స్థానాన్ని గిల్ భర్తీ చేయగలడు అనే నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు  గిల్ పై పూర్తి విశ్వాసం ఉంది. అందుకే అతన్ని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ చేశాం అంటూ తెలిపాడు. కెప్టెన్సీ విషయంలో కేవలం వ్యక్తిగత ఆటను మాత్రమే కాకుండా ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పుకొచ్చాడు. కేవలం ఫలితాల ఆధారంగా మాత్రమే మద్దతుగా నిలిచే వ్యక్తిని తాను కాదు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: