8 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ హోదా.. ఈ చిన్నారికి సలాం కొట్టాల్సిందే?

praveen
చదరంగం.. ఈ పదం పలకడానికి చాలా ఈజీగా ఉన్న. ఆట ఆడటం మాత్రం చాలా కష్టం.  ఏకంగా 64 గడులు ఉండే ఈ చదరంగం ఆటలో ఎత్తులు ఫైఎత్తుల కోసం ఇక బ్రెయిన్ ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి. ఏమాత్రం అలసిపోయినా ప్రత్యర్థి మనపై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. అన్ని ఆటల్లో లాగా ఈ చదరంగంలో ఫిజికల్ గా కష్టపడేది ఏమీ ఉండదు. ఒకచోట కూర్చొని సైలెంట్ గా ఉంటూ కేవలం మైండ్ కి మాత్రమే పని చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రతి స్టెప్పులో బ్రెయిన్ కి పదును పెడతారో.. ఇక వారే చెస్ లో విజేతగా నిలుస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది భారతీయులు అటు చదరంగం ఆటలో సత్తా చాటుతూ ఉన్నారు.


 లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ దగ్గర నుంచి మొన్నటికి మొన్న యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరకు కూడా ఎంతో మంది ప్రపంచ స్థాయిలో చెస్ ఆటలో గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే తమ ఆట తీరుతో ప్రపంచాన్ని మొత్తం ఫిధా చేసేసారు  అయితే ఇక ఇప్పుడు ఏకంగా మరో 8 ఏళ్ల చిన్నారి గ్రాండ్ మాస్టర్ గా హోదా సంపాదించింది. సాధారణంగా ఎనిమిదేళ్ల వయసులో ఏం చేస్తారు అంటే రోజు బడికి వెళ్లడం స్నేహితులతో ఆడుకోవడం చేస్తాం అంటారు చిన్న పిల్లలు  కానీ ఇక్కడ మాత్రం ఈ చిన్నారి ఏకంగా తన ప్రతిభతో ప్రపంచాన్ని మొత్తం మంత్రముగ్ధుల్ని చేస్తుంది.


 భారతీయ మూలాలు ఉన్న 8 ఏళ్ల అమ్మాయి పసిప్రాయంలోనే చెస్ లో గొప్ప స్థాయికి చేరుకుంది. ఇటీవల క్రోయేషియాలో జరిగిన యూరోపియన్ రాపిడ్, బ్రిట్జ్ ఛాంపియన్షిప్ లో 8 ఏళ్ల బోధన అద్భుతం చేసింది. తనకంటే 30 ఏళ్ల పెద్దదైన ఎంతో అనుభవిరాలైన క్రీడాకారిని బోధన అవలీలగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభం  నుంచి తన ఎత్తులతో ప్రత్యర్థికి  చెమటలు పట్టించిన బోధన విజేతగా నిలిచింది. దీంతో చెస్ దిగ్గజాలను సైతం ఫిదా చేసింది  అత్యుత్తమ మహిళా ప్లేయర్ టైటిల్ని కూడా సొంతం చేసుకుంది ఈ చిన్నారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: