డబ్బు కోసమే.. ఆ ప్లేయర్లు మినీ వేలంలోకి వచ్చారు : డీకే
అనుకున్నట్లుగానే ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ జట్టులో సభ్యులుగా కొనసాగుతున్న ఆటగాళ్లకు భారీ ధర పెట్టాయి ఆయా ఫ్రాంచైజీలు. ఏకంగా ఐపీఎల్ ప్రైస్ మనీ కంటే ఎక్కువ ధరను ఆ ఆటగాళ్ల కోసం వెచ్చించడం గమనార్హం. ఏకంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 20.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా కెప్టెన్ గా కొనసాగుతున్న ప్యాట్ కమిన్స్ ను జట్టులోకి తీసుకుంది. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక ధర అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో.. అంతలోనే మరో ఆస్ట్రేలియా ప్లేయర్ భారీ ధర పలికాడు.
ఏకంగా మిచెల్ స్టార్క్ ను కోల్కతా జట్టు 24.75 కోట్ల రూపాయలు చెల్లించి జట్టులోకి తీసుకుంది. అయితే ఇక ఇలా ఆస్ట్రేలియా ప్లేయర్లకు భారీ ధర పలకడం గురించే అందరు చర్చించుకుంటూ ఉన్నారు. ఇక ఈ విషయం గురించి స్పందించిన భారత వెటరన్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారీగా డబ్బు రావాలి అనే ప్లాన్ తోనే ప్యారిస్ ప్లేయర్లు మెగా వేలంలోకి కాకుండా మినీ వేలంలోకి వస్తున్నారు అంటూ దినేష్ కార్తీక్ అన్నాడు. ఇది సరైనది కాదు. మినీ వేలంలోకి రావాలనుకునే వారికి గతంలో ఉన్న గరిష్ట మొత్తమే ఇచ్చి జట్లు మారెందుకు అవకాశం ఇవ్వాలి. మినీ వేలంలో భారీ ధర పలికితే ఆ టీంలో అప్పటికే భారీ ధర పలికిన ఆటగాళ్లకు ఇచ్చినంత ఇచ్చి.. మిగిలింది బీసీసీఐకి అందించాలి అంటూ దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.