డ్రగ్స్ వాడటంతో.. ఇద్దరు క్రికెటర్ల పై నిషేధం?

praveen
జింబాబ్వే క్రికెట్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు మహా మహా టీమ్స్ ని సైతం తమ ఆట తీరుతో భయపెట్టిన జింబాబ్వే.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. కనీసం పసికూనా టీమ్స్ కి సైతం సరైన పోటీ ఇవ్వలేక ఇక రోజు రోజుకు వెనుకబడిపోతుంది అని చెప్పాలి. ఇప్పటికే అటు ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో అర్హత సాధించేందుకు క్వాలిఫైయర్ మ్యాచ్ లలో పెద్దగా రానించలేక నిరాశపరిచింది. ఇక 2024 t20 వరల్డ్ కప్ కోసం కూడా అర్హత సాధించలేకపోయింది జింబాబ్వే జట్టు.


 ప్రస్తుతం జింబాబ్వే జట్టుకు సికిందర్ రాజా కెప్టెన్ గా ఉండగా అతను ఒక్కడు తప్ప ఇక జట్టులోని మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా చెప్పుకుదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. ఇక చిన్న చిన్న టీమ్స్ చేతుల్లో సైతం జింబాబ్వే టీం అత్యంత దారుణంగా ఓడిపోతూ ఉండడంతో ఇక ఆ జట్టు ఆట తీరూపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఓటములకు బాధ్యత వహిస్తూ ఇటీవల ఆ జట్టు హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. జింబాబ్వే కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరికి అతను కోచ్గా తప్పుకున్నాడు.


 అయితే ఇక ఇప్పుడు జింబాబ్వే టీం గురించి మరో సంచలన వార్త తెరమీదికి వచ్చింది. ఏకంగా నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకున్నారు అనే కారణంతో జింబాబ్వే టీం లోని ఇద్దరు క్రికెటర్ల పై ఆ దేశ క్రికెట్ బోర్డు బ్యాన్ చేసింది. వెస్లీ మెద, బ్రాండెన్ మౌత్ డొపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది  ఏకంగా కొక్కైన్ లాంటి డ్రగ్స్  వాడినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై విచారణ జరిపిన ఆ దేశ క్రికెట్ బోర్డు ఇక డొపింగ్ నిజమే అని తేలడంతో చివరికి ఇద్దరు  ఆటగాళ్లపై నిషేధం విధించింది. దీంతో ఇద్దరు ప్లేయర్లు ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలు లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: