అంపైర్ తో గొడవ.. ఆర్సిబి ప్లేయర్ పై నిషేధం?

praveen
ప్రొఫెషనల్ క్రికెట్లో ఆటగాడిగా కొనసాగుతున్న ప్రతి ప్లేయర్ కూడా  నిబంధనలకు అనుగుణంగానే తమ కెరియర్ను కొనసాగించాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వరల్డ్ క్రికెట్లో ఎంతటి స్టార్ ప్లేయర్గా ఎదిగినప్పటికీ.. అటు మ్యాచ్ రిఫరీల  విషయంలో మాత్రం ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. ఇక ఎవరైనా ఆటగాడు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసింది అంటే చాలు ఇక వారిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఎక్కడ వెనకడుగు వేయదు.


 అందుకే ఎంతోమంది ప్లేయర్లు ఇక మ్యాచ్లో తమ భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకొని ఇక మ్యాచ్ ను కొనసాగించడం లాంటివి చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు కోపంతో ఊగిపోయినప్పటికీ ఆటగాళ్లు ఎంపైర్ల  జోలికి మాత్రం వెళ్ళరు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ఐసిసి ఎప్పటికప్పుడు నిబంధనలను మరింత కఠిన తరం చేస్తూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే  అయితే ఇప్పటివరకు ఎన్నోసార్లు మ్యాచ్ జరుగుతున్న  సమయంలో ప్లేయర్లు ఎంపైర్లతో వాగ్వాదానికి దిగి ఇక ఐసిసి ఆగ్రహానికి గురయ్యారు అన్న విషయం తెలిసిందే.


 అయితే కేవలం అంతర్జాతీయ మ్యాచ్లలో మాత్రమే కాదు దేశీయ  టి20 టోర్నీలలో ఆడుతున్న ప్లేయర్లు కూడా నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలి. అయితే ఇలా నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను ఇటీవల ఒక ప్లేయర్ పై ఏకంగా నాలుగు మ్యాచ్ల నిషేధం పడింది. ఆ ప్లేయర్ ఎవరో కాదు ఐపీఎల్ లో బెంగుళూరు జట్టుకు చెందిన ఆటగాడు కావడం గమనార్హం. ఇంగ్లీష్ క్రికెటర్ టామ్ కరన్ పై బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులు 4 మ్యాచ్ ల నిషేధం విధించారు. బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్స్ టీం తరఫున ఆడుతున్నాడు టామ్ కరణ్. ఐపీఎల్ మినీ వేలంలో అతన్ని బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: