ఐపీఎల్ లో.. గిరిజన తెగకు చెందిన ప్లేయర్ కి రూ. 3.6 కోట్లు?

praveen
సాధారణంగా ఐపీఎల్ వేలం అంటే చాలు ఆటగాళ్లు పలికే రికార్డు స్థాయి ధరలు అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి. వేలంలో స్టార్ ప్లేయర్లు ఉన్నారు అంటే చాలు ఇక ఆయా ప్లేయర్లను తమ టీం లోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఎంత మొత్తంలో ఖర్చు చేసేందుకైనా సిద్ధమవుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ గత రెండు సీజన్ల నుంచి కూడా ఫ్రాంచైజీ  తీరు పూర్తిగా మారిపోయింది. ఒకవైపు స్టార్ ప్లేయర్లను ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్న జట్ల యాజమాన్యాలు.. ఇక అప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టకపోయినా ఇక దేశవాళి క్రికెట్లో రాణిస్తున్న యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తున్నాయి అని చెప్పాలి.


 భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలా కుర్రాళ్లను  ఏకంగా కోట్ల రూపాయలు పెట్టి జట్టులోకి తీసుకుంటు ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన మినీ వేలం ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగింది. అయితే ఈ మినీ యాక్షన్ లో మరోసారి కుర్రాళ్ళు సత్తా చాటారు. ఏకంగా దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించారూ. దీంతో ఇక అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ప్లేయర్ల కోసం ఫ్రాంచైసీలు తెగ పోటీపడి మరి కోట్ల రూపాయలకు దక్కించుకున్నాయి అని చెప్పాలి.


 ఇలా ఇటీవల జరిగిన వేలంలో కోట్ల రూపాయల ధర దక్కిన యంగ్ ప్లేయర్లలో అటు గిరిజన తెగకు చెందిన రాబిన్ మింజ్  కూడా ఉన్నాడు  ఝార్ఖండ్ వికెట్ కీపర్ గా ఉన్న ఇతన్ని గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్లు పెట్టి దక్కించుకుంది. గిరిజన తెగకు చెందిన రాబిన్  ఎన్నో కష్టాలను క్రికెట్ కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇక ఇండియన్ పోలార్డుగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అందుకే అతన్ని ఫ్రాంచైజీలు తమ పర్స్ లిమిట్ అయిపోయేదాకా అతని కోసం పోటీపడ్డాయి. చివరికి గుజరాత్ అతని దక్కించుకుంది. 21 ఏళ్ల ఈ ప్లేయర్ ప్రస్తుతం క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక అతని తండ్రి ఆర్మీలో పనిచేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: