అన్ క్యాప్డ్ ప్లేయర్ కి.. ఢిల్లీ అంత ధర ఎందుకు పెట్టిందంటే?
అయితే ఇక ఇటీవలే 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన మినీ వేలం అటు దుబాయ్ వేదికగా జరిగింది. ఇక ఈ వేలంలో అందరూ అనుకున్నట్లుగానే స్టార్ ప్లేయర్లు భారీ ధర పలికారు. అయితే కేవలం స్టార్ ప్లేయర్లు మాత్రమే కాదు.. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అడుగుపెట్టని అన్ క్యాప్డ్ ప్లేయర్లకి కూడా కోట్ల రూపాయల ధర పలకడం గమనార్హం. కేవలం 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలో పాల్గొన్న ఆటగాళ్ళను ఏకంగా కోట్ల రూపాయలు పెట్టి ఆయా ఫ్రాంచైజీలు మిగతా టీమ్స్ తో పోటీపడి మరి జట్టులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై జట్టు ఏకంగా సమీర్ రిజ్వినీ 8.4 కోట్లకు దక్కించుకుని అన్న విషయం తెలిసిందే.
ఇక ఐపీఎల్ వేలంలో మరో అన్ క్యాప్డ్ ప్లేయర్ కూడా ఇలాగే కోట్ల రూపాయలు ధర పలికాడు. అతను ఎవరో కాదు జార్ఖండ్ వికెట్ కీపర్ కుమార్ కుషాగ్ర. ఏకంగా 7.20 కోట్లు వెచ్చించి ఢిల్లీ క్యాపిటల్స్ అతని సొంతం చేసుకుంది. గత ఏడాది నాగాలాండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 17 ఏళ్లకే ఈ కుర్ర ఆటగాడు 266 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో కూడా 90 స్ట్రైక్ రేటుతో 275 పరుగులు చేశాడు. ఇక ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి దిగి డెత్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేయగల సత్తా ఇతని సొంతం. అందుకే ఫ్రాంచైజీల కన్ను ఇతనిపై పడింది. ఇదే అతనికి భారీ ధర వచ్చేలా చేసింది అని చెప్పాలి.