ఫ్రాంచైజీలు అతని కోసం పోటీ పడుతుంటే.. అతనేమో ధోని జపం చేస్తున్నాడు?
ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి హాట్ టాపిక్ గా మారిపోయిన దక్షిణాఫ్రికా యువ సంచలనం గురించి ఎన్నో ఫ్రాంచైజీలు సొంతం చేసుకోవాలని పోటీ పడుతున్నాయి. కానీ ఆ ఆటగాడు మాత్రం మహేంద్రసింగ్ ధోని జపం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆడాలని ఉంది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే వరల్డ్ క్రికెట్లో ఉన్న లెజెండరీ కెప్టెన్లలో మహేంద్రసింగ్ ధోని కూడా ఒకరు. ఏకంగా టీమ్ ఇండియాకు రెండుసార్లు వరల్డ్ కప్ అందించిన సారధిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇక ధోని లాంటి సారథి ఆధ్వర్యంలో ఒక్క సీజన్ ఐపీఎల్ ఆడిన చాలు అని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా యువ సంచలనం కోఎడ్జి కూడా ఇదే అనుకుంటున్నాడు. వేలంలో అంతిమంగా ధోని జట్టులోకి వెళ్తే ఎంతో బాగుంటుంది. అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన ధోని సారథ్యంలో ఆడటం గొప్ప అవకాశం అని చెప్పాలి. ఎంతో నేర్చుకోవచ్చు. అపార అనుభవాన్ని కూడా సంపాదించవచ్చు. సూపర్ కింగ్స్ ఫ్యామిలీ ఎంతో స్పెషల్. అది పవర్ఫుల్ అద్భుతమైన ఫ్రాంచైజీ అంటూ కోయట్జీ ఇక తనకు చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడాలని ఉంది అని మనసులో మాట బయట పెట్టేసాడు. కాగా టీమిండియాతో టెస్ట్ సిరీస్ పై ఫోకస్ చేయడానికి ప్రస్తుతం వన్డే సిరీస్ నుంచి దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. మరి వేలంలో ఇతనికి ఎంత ధర దక్కుతుంది. ఏ జట్టులోకి వెళ్తాడు అన్నది చూడాలి.