దేశం కంటే ఐపీఎల్ ఎక్కువా.. దుమ్మెత్తి పోస్తున్న మీడియా?
ఈ క్రమంలోనే ఇప్పుడు ఐపీఎల్ హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అందరూ సిద్ధమైపోతున్నారు. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు అయిన రికీ పాంటింగ్, ట్రేవర్ బేలీస్ లపై ఇక ఆసీస్ మీడియా ప్రస్తుతం దుమ్మెత్తి పోస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఇద్దరికీ దేశం కంటే బీసిసిఐ నిర్వహించే ఐపిఎల్ ముఖ్యమా అంటూ ప్రస్తుతం అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా సొంత గడ్డపై ప్రస్తుతం పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇంకోవైపు బిగ్ బాష్ లీగ్ కూడా రసావత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా రికీ పాంటింగ్ కామెంట్రీ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది.
అయితే ఇక ఇప్పుడు వేలం ఉన్న నేపథ్యంలో ఏకంగా ఈ బాధ్యతలను మధ్యలోనే వదిలేసి వేలం కోసం దుబాయ్ వెళ్లిపోయాడు. ఇక మరో ఆటగాడు బెలిస్ కూడా బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్స్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నా.డు ఇక ఈ బాధ్యతలను కూడా వదిలేసి ఏకంగా వేలంలో పాల్గొనేందుకు పాంటింగ్ దారిలోనే దుబాయ్ చేరుకున్నాడు. దీంతో ఇక వీరిపై అటు ఆ దేశ మీడియా దుమ్మెత్తి పోస్తుంది. ఈ ఇద్దరు క్రికెటర్లకు దేశం కంటే ఏకంగా ఐపీఎల్ ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అని చెప్పాలి.