ముంబై కెప్టెన్ ని మార్చడంలో.. తప్పేముంది : గవాస్కర్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరుగాంచిన రోహిత్ శర్మను కాదని కొత్త కెప్టెన్ ను నియమించింది. ఏకంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య చేతికి సారధ్య బాధ్యతలు అప్పగించింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. రోహిత్ అభిమానులు అయితే ఈ కెప్టెన్సీ మార్పును ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

 ఏ టీం అయినా సరే జట్టును ఛాంపియన్గా నిలిపే సారధి కావాలని అనుకుంటూ ఉంటుంది. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం ఐదు సార్లు ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ ను పక్కనఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. జట్టును చాంపియన్గా నిలిపిన కెప్టెన్ రోహిత్ కు ముంబై ఇండియన్స్ కనీస గౌరవాన్ని ఇవ్వలేకపోయింది అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఇదే విషయం గురించి టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ కు కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించడాన్ని గవాస్కర్ సమర్ధించాడు. తప్పొప్పుల జోలికి మనం వెళ్ళకూడదు. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. ముంబై చివరగా 2020లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. నిరంతరంగా ట్రోఫీలు ఆడటం వల్ల అటు రోహిత్ శర్మ కూడా అలసిపోయి ఉండవచ్చు. గత ఏడాది గుజరాత్ కి పాండ్యా టైటిల్ అందించారు. ఈ క్రమంలోనే అతని ద్వారా జట్టులో కొత్త ఉత్సాహం వస్తుందని అటు ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావించి ఉండవచ్చు అంటూ గావాస్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: