ప్చ్.. రింకుకి చాన్స్ దక్కలేదే?
ఇక ప్రస్తుతం భారత జట్టు టి20 ఫార్మాట్లో ఆడుతున్న ప్రతి సిరీస్ లోను రింకు చాన్స్ దక్కించుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉండగా t20 సిరీస్ ముగించుకుంది. ఇక ఇటీవల వన్డే సిరీస్ కూడా ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా జోహాన్నస్ బర్గ్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ ఆడింది. ఇక ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ను చిత్తుగా ఓడించింది భారత జట్టు. మొదటి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను 116 పరుగులకే చాప చుట్టేసేలా బౌలింగ్ విభాగం చెలరేగిపోయింది. ఇక తర్వాత స్వల్ప లక్ష్యాన్ని బ్యాట్స్మెన్లు అలవోకగా చేదించారు.
అయితే ఇటీవల టీ20లలో సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతున్న రింకూ సింగ్ కి ఇక సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్లో ఓడిఐ అరంగేట్రం కూడా ఖాయమని అభిమానులు అందరూ కూడా అనుకున్నారు. కానీ ఊహించనీ రీతిలో మొదటి మ్యాచ్లో అతనికి చోటు తగ్గలేదు. దీంతో రింకు అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే అంతకు ముందు జరిగిన టి20 సిరీస్ లో రెండు మ్యాచ్లలో రింగు సింగ్ రాణించాడు. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. అయితే సంజూ శ్యాంశన్ కు బదులు తుది జట్టులో రింకు అరంగేట్రం ఉంటుందని భావించినప్పటికీ అవకాశం దక్కలేదు. మరి మిగిలి ఉన్న మరో రెండు మ్యాచ్లలో రింకు వన్ డేల అరంగేట్రం ఉంటుందో లేదో చూడాలి మరి.